తెలంగాణ
Hyderabad: ఓల్డ్ మలక్‌పేటలో అక్కని చంపిన తమ్ముడు

Hyderabad: హైదరాబాద్ ఓల్డ్ మలక్‌పేటలో దారుణం జరిగింది. తమ్ముడు మదన్‌బాబు అక్క లక్ష్మిని చంపేశాడు. హైదరాబాద్ చాదర్‌ఘాట్ పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. అక్క లక్ష్మిపై విచక్షణా రహితంగా దాడి చేసి తమ్ముడు మదన్‌బాబు చంపేశాడని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
అక్కపై దాడిని అడ్డుకోబోయిన అన్నకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబకలహాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు మదన్‌బాబు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు.