సినిమా

Good Bad Ugly: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ట్రైలర్ విడుదల

Good Bad Ugly: అజిత్ కుమార్ లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కోసం అభిమానుల ఆత్రుత ఆకాశాన్ని తాకుతోంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ టీజర్ రిలీజ్‌తోనే సంచలనం సృష్టించగా, తాజాగా విడుదలైన ట్రైలర్ మాస్ అంటే ఏంటో మరోసారి చాటి చెప్పింది.

దర్శకుడు అధిక్ రవిచంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అజిత్ వైవిధ్యమైన గెటప్స్, థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్‌తో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నారు. ట్రైలర్ చూసిన అభిమానులు ‘ఇది మాస్ మసాలా ఫీస్ట్’ అంటూ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.ఈ భారీ ప్రాజెక్ట్‌లో త్రిష హీరోయిన్‌గా, సిమ్రాన్ కీలక పాత్రలో కనిపించనుండగా, జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాకు మరో హైలైట్‌గా నిలవనుంది.

ఏప్రిల్ 10న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. అజిత్ మార్క్ యాక్షన్, డైలాగ్ డెలివరీ, స్టైలిష్ లుక్స్‌తో ఈ సినిమా థియేటర్లలో దుమ్మురేపనుందని టాక్. మరి, ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది? బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్ల కలెక్షన్లు రాబడుతుంది? అనేది చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button