Aditya 369: ఆదిత్య 369 రీ రిలీజ్ డేట్ చేంజ్.. ఎప్పుడంటే?

Aditya 369: ప్రస్తుతం రీరిలీజ్ సందడి జోరుగా సాగుతుంది. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు రీరిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేస్తున్నారు. రీసెంట్ గా మహేశ్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సలార్ రీరిలీజ్ కాగా, అవి సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి.
ఇక ఇప్పుడు బాలయ్య కథానాయకుడిగా రూపొందిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’ రెడీ అయ్యింది. సుప్రసిద్ధ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు దర్శకతత్వంలో వచ్చిన ఈ మూవీ మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి రెడీగా ఉంది.1991లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ఈ మూవీని 4K డిజిటలైజేషన్, 5.1 సౌండ్‌తో మరింత అధునాతనంగా మళ్ళీ ప్రేక్షకులకు అందిస్తున్నారు.
అయితే చక్కని థియేటర్లు లభించడంతో, ముందుగా అనుకున్న ఏప్రిల్ 11న కాకుండా ఏప్రిల్ 4వ తేదీనే రీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇండియాస్ మొదటి సైన్స్ ఫిక్షన్ గా వచ్చిన ఈ సినిమా రీరిలీజ్ కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.