సినిమా

Mahesh Babu Son: వావ్ అనిపిస్తున్న మహేష్ వారసుడి యాక్టింగ్.. వీడియో వైరల్

Mahesh Babu Son: సూపర్ స్టార్ మహేష్ బాబు టాప్ హీరోగా తన అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు ఆయన కుమారుడు గౌతమ్ ఘట్టమనేని కూడా నటనపై ఆసక్తి చూపిస్తున్నట్లు స్పష్టమవుతోంది. చిన్న వయసులోనే ‘1-నేనొక్కడినే’ సినిమాలో గెస్ట్ అప్పీర్‌న్స్ ఇచ్చిన గౌతమ్, ఇప్పుడు అసలైన ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. న్యూయార్క్‌లోని NYU టిష్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో యాక్టింగ్ శిక్షణ తీసుకుంటున్న గౌతమ్.. తాజాగా ఓ మైమ్ ప్రదర్శనలో పాల్గొన్నాడు.ఈ మైమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

క్యాండిల్ లైట్ డిన్నర్ సన్నివేశాన్ని మాటలు లేకుండా భావోద్వేగాలతో అందించడం ఈ ప్రదర్శన ప్రత్యేకత. ఇందులో గౌతమ్ నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. నవ్వు, కోపం, బాధ వంటి ఎమోషన్లు గౌతమ్ ఎలాంటి డైలాగ్స్ లేకుండానే చాలా క్లాస్‌గా ప్రెజెంట్ చేయగలగడం ఆకట్టుకునే అంశం. ఈ ప్రదర్శన అతని కెరీర్‌కు మంచి బేస్ అవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ మైమ్ వీడియోను సెరాఫీనా జెరోమీ డైరెక్ట్ చేయగా, గౌతమ్‌తో పాటు కాశ్వీ రమణి కీలక పాత్రలో కనిపించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button