ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: ఉగ్ర కదలికలపై నిరంతరం నిఘా అవసరం

Pawan Kalyan: ఏపీలో ఉగ్ర కదలికలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇందులో భాగంగా సీఎస్, డీజీపీలకు లేఖ రాశారు పవన్ కల్యాణ్. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఉగ్ర కదలికలపై నిరంతరం నిఘా అవసరమన్నారు పవన్ కల్యాణ్. తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.
రోహిం గ్యాలు, ఉగ్రవాద సానుభూతిపరులు, స్లీపర్ సెల్స్ ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు పవన్ కల్యాణ్. విజయనగరంలో ఐసిస్‌తో సంబంధాలు ఉన్న వ్యక్తి అరెస్ట్ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.