క్రీడలు
Gongidi Trisha: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు క్రికెటర్ గొంగిడి త్రిష.. ఘనస్వాగతం పలికిన HCA అధ్యక్షుడు

Gongidi Trisha: అండర్-19 వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శన చేసిన క్రికెట్ గొంగిడి త్రిష.. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా HCA అధ్యక్షుడు ఆమెకు ఘనస్వాగతం పలికా రు. అండర్ -19 వరల్డ్ కప్‌లో అటు బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ త్రిష సత్తా చాటింది. సెంచరీ చేసి మహిళా ప్లేయర్‌గా త్రిష రికార్డ్ నమోదు చేసింది. ఫైనల్లో 44 పరుగులు చేసి.. మూడు వికెట్లు తీసిన గొంగిడి త్రిష, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కించుకున్నారు.
అండర్-19 వరల్డ్ కప్‌లో సెంచరీ సాధించడం సంతోషంగా ఉందన్నారు గొంగిడి త్రిష. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను క్రికెట్లో రాణించానని చెప్పారు. మాజీ క్రికెటర్ మితాలి రాజ్ ను స్ఫూర్తిగా తీసుకున్నట్లు గొంగిడి త్రిష వివరించింది. మునుముందు ఎన్నో రికార్డులు సాధించేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది.