తెలంగాణ
Adluri Lakshman: దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేయొద్దు

Adluri Lakshman: బీజేపీ నేతలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఓట్ల తొలగింపునకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. యువతను రెచ్చగొట్టే ప్రసంగాలు మానుకుని రాష్ట్ర అభివృద్ధికి నిధులు తీసుకురావాలని సూచించారు.



