ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం..!

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు వేగం పుంజుకుంటున్నాయి. బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ ముద్దాడ రవిచంద్రతో పాటు బోర్డు సభ్యులు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు వేదపండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం టీటీడీకి సంబంధించిన పలు అంశాలపై చైర్మన్ బీఆర్ నాయుడుతో సీఎం చర్చించారు. సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను చైర్మన్, ఈఓ సీఎంకు వివరించారు.
తిరుమలలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల అభివృద్ధికి 240 కోట్ల రూపాయలు కేటాయించేందుకు అంగీకరించారు. సామాన్య భక్తులకు ఎప్పటికప్పుడు మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు.



