ఆంధ్ర ప్రదేశ్
నన్ను చూసి నవ్వుతావా?.. తండ్రినే హత్య చేసిన కొడుకు

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి మద్యం తాగొద్దని మందలించిందన్న కోపంతో తండ్రి నవ్వాడని ఆగ్రహంతో ఓ కొడుకు కత్తితో దాడి చేసి హత్య చేశాడు. మద్యం మత్తులో చెంగారెడ్డి గొంతు కోయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
తల్లి, భార్య ఎన్నిసార్లు చెప్పినా మద్యం మానకపోవడంతో తరచూ కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హత్య అనంతరం నిందితుడు పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.



