ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో కరోనా కలకలం

ఏపీలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. జూన్ 26 నుంచి ఇప్పటివరకు 67 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, అందులో 12 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో నలుగురు మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
కడప, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కోవిడ్ కేసులు మళ్లీ వెలుగుచూడడంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రజలు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు పాటించాలని జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్యశాఖ సూచిస్తోంది.



