తెలంగాణ

పెట్రోల్, డీజిల్ పెంపుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆగ్రహం

పెట్రోల్, డీజిల్ పెంపుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వ నిర్ణయం సమర్థనీయం కాదన్నారు. ధరల పెంపుతో సామాన్యులపై భారం పడుతోందన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజల నడ్డి విరిగిపోతోందన్నారు.

ఓట్ల కోసమే ఆత్మనిర్భర్ నినాదమని ఎద్దేవా చేశారు. కేంద్ర నిర్ణయాలతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు దెబ్బతింటున్నాయని విమర్శించారు. యుద్ధాన్ని సాకుగా చూపి ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటున్న కేంద్ర పెద్దలు చెప్తున్నారని.. అలాంటప్పుడు మరి ధరల పెంపు ఎందుకని రేవంత్ ప్రశ్నించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button