దారుణం.. ప్రియురాలిని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టిన నేవీ ఉద్యోగి

విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన చింతాడ రవీంద్ర నేవీలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. గాజువాక, ఎల్వీ నగర్‌లోని కీర్తి ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో భార్యతో కలిసి ఉంటున్నాడు. రవీంద్ర భార్య.. కాన్పు కోసం పుట్టింటికి వెళ్లడంతో అతని ప్రియురాలైన మౌనికను ఇంటికి పిలిపించుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మౌనికను రవీంద్ర హత్య చేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా శరీర భాగాల్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాడు.
మౌనికను హత్య చేసిన రవీంద్ర గాజువాక పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అపార్ట్‌మెంట్‌లో శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. డబ్బుల కోసం మౌనిక వేధించడంతో.. హత్య చేశానని నేరస్థుడు అంగీకరించినట్టు తెలుస్తోంది. రవీంద్ర కు సంబంధించి న పూర్తి వివరాలు తమకు తెలియవని, ఎవరితో మాట్లాడేవాడు కాదని నైబర్స్ చెబుతున్నారు.



