ఆంధ్ర ప్రదేశ్
అంబటి రాంబాబు పీటీ వారెంట్ దాఖలు

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు కేసుకు సంబంధించి పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. గతేడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్‌ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన అంబటి.. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు తోసుకుని వెళ్లారు. ఈ ఘటనపై అప్పట్లోనే పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
అంబటి రాంబాబు అప్పట్లో పోలీసులు అడ్డుకున్నా బారికేడ్లను తోసుకుని ఆందోళనలో పాల్గొన్నారని, ఈ విషయంపై కేసు దర్యాప్తు జరుగుతోందని పోలీసులు పీటీ వారెంట్ లో ప్రస్తావించారు. ఈనెల 11న కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించారు.



