తెలంగాణ
ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డుపై పెద్దపులి

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. తీర్యాణి మండలం కైరిగూడా, చోపిడి గ్రామాల మధ్య రాత్రి రోడ్డుపై పెద్దపులి కనిపించింది. అటుగా వెళ్తున్న వాహనదారులు పెద్దపులి దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించారు. పెద్దపులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీశాఖ.. అటవీ సమీప గ్రామాలకు హెచ్చరికలు జారీ చేసింది. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.



