ఆంధ్ర ప్రదేశ్
Bapatla: అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Bapatla: బాపట్ల జిల్లా నగరం మండలం చిరకాల వారి పాలెం తృట్టిలో తప్పిన పెను ప్రమాదం. స్టీరింగ్ స్టక్ అవడంతో అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు. బాపట్ల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు చీరాల నుండి రేపల్లె వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారుగా 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.



