ఆంధ్ర ప్రదేశ్
Guntur: రూ.50 పందెం కట్టి.. పెన్ను మింగిన విద్యార్థి

Guntur: 50 రూపాయల పందెం కోసం ఓ విద్యార్థి పెన్ను మింగేసేని ఘటన గుంటూరు జిల్లలో చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితం పందెం కట్టి విద్యార్థి మురళీకృష్ణా పెన్ను మింగేశాడు. దీంతో ఇటీవల విద్యార్థికి తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు.
కడుపులో పెద్ద పేగు వద్ద పెన్ను ఉన్నట్లు నిర్ధారించిన గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు ఎండోస్కోపీ ద్వారా పెన్నును విజయవంతంగా బయటకు తీశారు. ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ల టీమ్‌ను గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ అభినందించారు.



