సినిమా
Tirumala: తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Tirumala: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. అర్థరాత్రి వైకుంఠ ద్వారాలు తెరచుకోగా ముందుగా వీఐపీలకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కుటుంబ సభ్యులు, నారా రోహిత్ దంపతులు, ఎంపీ డీకే అరుణ ,ఎంపీ వేమిరెడ్డి దంపతులు, క్రికెటర్ తిలక్ వర్మ, వైసీపీ నేతలు పెద్దిరెడ్డి, ఆర్కే రోజా, మిథున్ రెడ్డి, భారత్ బయోటెక్ ఎంపీ కృష్ణ ఎల్లా, మేనేజింగ్ డైరెక్టర్ సుచరిత ఎల్లా తదితరులు శ్రీవారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకున్నారు.



