తెలంగాణ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Tirumala: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. అర్థరాత్రి వైకుంఠ ద్వారాలు తెరచుకోగా ముందుగా వీఐపీలకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు. తెలుగు రాష్ట్రాల మంత్రులు, ప్రముఖులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం సహా.. స్పీకర్ గడ్డం ప్రసాద్, ఏపీ హైకోర్టు జడ్జి శ్రీనివాసులు, కేంద్రమంత్రి రామ్మోహన్, శాసన సభాపతులు అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణరాజు, ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లారెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు.



