ఆంధ్ర ప్రదేశ్
Duvvada Srinivas: చంపాలనుకుంటే రెండీ.. దువ్వాడ శ్రీనివాస్ హల్చల్

Duvvada Srinivas: శ్రీకాకుళంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హల్చల్ చేశారు. నిమ్మాడ జంక్షన్ నుంచి ప్రత్యర్థులకు దువ్వాడ సవాల్ విసిరారు. మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ను ఛాలెంజ్ చేశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని దువ్వాడ అన్నారు.
తాను చావుకు భయపడే వ్యక్తిని కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే చంపేస్తారా? అని ప్రశ్నించారు. కేడీ బ్రదర్స్ రాజకీయాలను భ్రష్టు పట్టించారన్నారు. చంపాలనుకుంటే రండీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.



