ఆంధ్ర ప్రదేశ్
శ్రీశైలం బ్యాక్వాటర్లో పెద్దపులి ఈత.. వీడియో వైరల్

నంద్యాల జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్లో పెద్దపులి ఈత కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అమ్రాబాద్ అభయారణ్యానికి పులి ఈదుకుంటూ వెళ్లినట్లు తెలుస్తోంది. సంగమేశ్వరం సమీప ప్రాంతం నుంచి కొల్లాపూర్ అడవుల్లోకి టీ65 పులి వెళ్లినట్లు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు.. పులి కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు.మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.



