తెలంగాణ

Road Accident: బొలెరోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి

Road Accident: మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందారం ఎక్స్‌రోడ్‌ వద్ద రోడ్డు వద్ద ఆగి ఉన్న బులారో వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

మహారాష్ట్ర నుంచి 23 మంది కూలీలతో కరీంనగర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ మూత్ర విసర్జన కోసం రోడ్డు పక్కన వాహనం ఆపిన సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button