సినిమా
Chiranjeevi: నెట్టింటిని షేక్ చేస్తున్న చిరు ఫ్రెష్ లుక్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి తాజాగా లేటెస్ట్ ఫోటోలు రిలీజ్ అయ్యాయి. ఫ్రెష్, ఎనర్జటిక్ లుక్లో కనిపిస్తున్న చిరంజీవి మెగా ఫ్యాన్స్ను ఎంతగానో ఆనందపరుస్తున్నారు.
చిరంజీవి హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం నుంచి చిరంజీవి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఛార్మింగ్, వింటేజ్ స్టైల్లో ఎనర్జీ నిండిన లుక్తో మెగాస్టార్ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ లుక్స్కు మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ నిర్మిస్తోంది.



