తెలంగాణ
Panchayat Elections: సర్పంచ్ ఎన్నికల్లో బాండ్ పేపర్ హామీల జోరు

Panchayat Elections: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాండ్ పేపర్‌పై హామీల జోరు కొనసాగుతోంది. ఒకరిని చూసి మరొకరు తమను సర్పంచ్‌గా గెలిపిస్తే అమలు చేసే హామీలను బాండ్ పేపర్‌పై రాసిస్తున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలో ఓటర్లను ఆకర్శించేందుకు వినూత్న రీతిలో ఓ అభ్యర్థి ప్రచారం చేస్తున్నారు.
కాచాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఆకుల మణేక్క 14 అంశాలతో కూడిన హామీలిను బాండ్ పేపర్‌పై సతకం పెట్టి మరీ రిలీజ్ చేసింది. 40 ఏళ్ల కిత్రం ఈ గ్రామానికి కోడలిగా వచ్చానని అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ గ్రామం పెద్దగా అభివృద్ధి చెందలేదన్నారు మణేక్క. తన కుటుంబాన్ని చక్కదిద్దుకున్న తాను గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తానని తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.



