తెలంగాణ
Hyderabad: ఎస్‌పీఆర్ హిల్స్ గ్రౌండ్‌లో అగ్ని ప్రమాదం.. 4 వాహనాలు దగ్ధం

Hyderabad: హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్స్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పార్కింగ్ ఏరియాలో ఉన్న వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.
అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. మూడు కార్లు, ఆటో మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు ఎవరైనా పెట్టారా లేదా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



