‘3 ఇడియట్స్-2’ లోడింగ్?

3 Idiots-2: బాలీవుడ్ ఆడియెన్స్‌ను ఏడిపించి నవ్వించిన ‘3 ఇడియట్స్’ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఈసారి ఆమిర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి ముగ్గురూ తల్లిదండ్రులుగా కనిపించనున్నారు. దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమాకి ఆమిర్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
వాయిస్ ఓవర్: 2009లో విడుదలైన ‘3 ఇడియట్స్’ సినిమా దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ అయింది. విద్యావ్యవస్థపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆలోచింపజేసిన ఈ చిత్రం ఇప్పటికీ అందరి మనసుల్లో నిలిచిపోయింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రాబోతోందన్న వార్తలు బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ రచన పనులు ప్రారంభించాడు.
ఈసారి కథ అమీర్, మాధవన్, శర్మన్ తల్లిదండ్రులుగా మారిన తర్వాత సాగనుంది. పిల్లలతో వారి సంబంధం, ఒత్తిడి, ఆశయాల మధ్య సాగే పోరాటం ప్రధానాంశంగా ఉంటుందని తెలుస్తోంది. ఆమిర్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చే అవకాశం ఉంది.



