తెలంగాణ
ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలు

తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల వేడుకల్లో భాగంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఇవాళ 10 గంటలకు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది.
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన కోసం ఒక్కొక్కటి సుమారు 17.50 లక్షల వ్యయంతో మొత్తం 5 కోట్ల 80 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆరు జిల్లాలు మినహా మిగతా జిల్లాలో ఈ కార్యక్రమం జరగనుంది.



