ఆంధ్ర ప్రదేశ్
Narasaraopeta: ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్ బ్లేడు వదిలేసిన వైద్యులు

Narasaraopeta: ఆపరేషన్ చేసి సర్జికల్ బ్లేడును శరీరంలో వదిలేసిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. నరసరావుపేట బాలయ్య నగర్‌కు చెందిన రమాదేవి అనే మహిళ చిన్న ఆపరేషన్ కోసం ఆస్పత్రిలో చేరింది. ఆమెకు డాక్టర్ నారాయణ స్వామి, సిబ్బంది ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తర్వాత నొప్పి తీవ్రంగా రావడంతో వైద్యులకు తెలపగా నొప్పి సహజమని వారు బాధితురాలికి నచ్చజెప్పారు.
రమాదేవి నొప్పి తట్టుకోలేకపోవడంతో స్కానింగ్ చేసిన వైద్య సిబ్బంది. తొడ దగ్గరలో సర్జికల్ బ్లేడు ఉన్నట్లు గుర్తించారు. దీంతో బాధిత మహిళ బంధువులు కంగుతిన్నారు. ఆపరేషన్ సమయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమకు న్యాయం చేయాలని ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు బాధితులు.



