సినిమా

పుష్ప-2 తొక్కిసలాట: శ్రీతేజ్ పరిస్థితి విషమం!

Pushpa-2 stampede: గత ఏడాది డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంద్యా థియేటర్ వద్ద జరిగిన పుష్ప-2 ప్రీమియర్ స్టాంపీడ్‌లో గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఇప్పటికీ కోలుకోలేదు. ఏడాది పూర్తైనా బాలుడు పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

2024 డిసెంబర్ 4న అల్లు అర్జున్ సంద్యా థియేటర్‌కు వచ్చి ప్రీమియర్ షో చూసిన సంఘటన తెలిసిందే. ఆ సమయంలో జనసమూహం అదుపు తప్పి తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ (8) తీవ్రంగా గాయపడ్డాడు. ఏడాది గడిచినా శ్రీతేజ్ పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల లేదు. తినడానికి కూడా స్వయంగా సాధ్యం కావడం లేదు.

మంచం మీదే పడి ఉన్నాడు, ఎవరినీ గుర్తుపట్టడం లేదు, కదలలేడు. నెలకు రూ.1.50 లక్షలు చికిత్స ఖర్చు అవుతోందని బాలుడి తండ్రి భాస్కర్ తెలిపారు. అల్లు అర్జున్ మేనేజర్‌ను సహాయం కోరినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఇప్పటివరకు పూర్తి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ తరుణంలో నిర్మాత బన్నీ వాసు స్పష్టమైన వివరణ ఇచ్చారు. దిల్ రాజు గారు సహా ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయంలో కచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేశారని, వైద్య ఖర్చులకు ఎంత, కుటుంబ ఖర్చులకు ఎంత కేటాయించాలో స్పష్టంగా చెప్పారని తెలిపారు. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగానే తాము సాయం అందించినట్టు వెల్లడించారు. కుటుంబ సభ్యులు ఈ సహాయం సరిపోలేదని భావిస్తే నేరుగా ఇండస్ట్రీ పెద్దలను కలవొచ్చని, అప్పుడు వారు చెయ్యమంటే అదనంగా ఏమైనా చేస్తామని బన్నీ వాసు చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button