తెలంగాణ
గ్రామ సర్పంచ్‌గా గెలిపిస్తే.. ఐదేళ్లు ఇంటి పన్ను చెల్లిస్తా: సర్పంచ్ అభ్యర్థి

గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఇట్టడి లక్ష్మి-ముత్యంరెడ్డి.. ఆ గ్రామానికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. గ్రామ సర్పంచ్‌గా తనను ఆశీర్వదిస్తే ఐదు ఏళ్ల పాటు బీసీ, ఎస్టీ, ఎస్సీ ప్రజలందరికీ ఇంటి పన్నును తానే స్వయంగా చెల్లిస్తానని హామీ ఇచ్చారు.
అలాగే కళ్యాణ లక్ష్మి కింద ఆడబిడ్డలకు 10 వేల116 రూపాయలు, ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు లేదా ముగ్గురు వాలెంటర్లను సైతం నియమించి విద్యాభివృద్ధికి తోడ్పడుతానన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల శిక్షణ నిమిత్తం సహకారాన్ని అందిస్తానన్నారు.



