Adoni: నకిలీ బాబా కలకలం.. క్షుద్ర పూజల పేరుతో రూ. 3. 50 కోట్లు బురిడీ

Adoni: ప్రస్తుత సమాజంలో, విద్యా స్థాయి పెరిగినా, సాంకేతికత అభివృద్ధి అయినా ఇంకా కొన్ని ఆధునిక మూఢ నమ్మకాలు సమాజంలో ఉన్నాయి. ఇవి వ్యక్తుల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా, అభివృద్ధికి కూడా అడ్డు వస్తున్నాయి. నేటికి చాలా మంది తమ జీవితంలోని ముఖ్య నిర్ణయాలను రాశి ఫలాల ఆధారంగా తీసుకుంటారు. ఇక కీలకమైన విషయాల్లోనైతే చెప్పాల్సిన అవసరం లేదు. నమ్మకం, మూఢ నమ్మకం మధ్యన ఉన్న తేడా ప్రశ్నించకుండా అనుసరించే నమ్మకమే అంధ విశ్వాసం. ఇక దీనిపై క్షుద్రపూజలపై ఎన్ని అవగాహనలు కల్పించినా కొందరు తీరు ఏమాత్రం మారడంలేదు.
అటు అమాయకులను అడ్డాగా చేసుకుని మోసగాళ్లు కూడా రెచ్చిపోతూనే ఉన్నారు. క్షుద్రపూజల నేపథ్యంలో జరిగిన మోసం ఘటన ఏపీలో తీవ్ర కలకలం రేపింది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఓ బురిడి బాబా.. పూజల పేరుతో ఓ జంట నుంచి ఏకంగా 3 కోట్ల మేర దోచుకున్నాడు. లంకె బిందెలు, అమ్మవారి విగ్రహం, క్షుద్ర పూజలు ఇలా ఏవేవో మాయ మాటలు చెప్పి దంపతులను నిలువునా దోచేశాడు.
ఆదోని పట్టణంలో ఓ నకిలీ బాబా క్షుద్ర పూజల డ్రామాతో అమాయక దంపతుల నుంచి ఏకంగా 3.50 లక్షలు బురిడీ కొట్టించాడు. బైచిగేరి ప్రాంతానికి చెందిన దుర్గాసింగ్ అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్రం పెబ్బేరుకు చెందిన వెంకటయ్య, పద్మ బాధితులు. ఈ దంపతులు ఉండవల్లి వాసులు. వీరు పెబ్బేరులో హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.
గతంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ దంపతులు, దుర్గాసింగ్‌ను దేవుడు వస్తాడని స్థానికులు చెప్పడంతో ఆదోని వెళ్లి పూజలు చేయించుకున్నారు. బైచిగేరి కేంద్రంగా ఉన్న దుర్గాసింగ్ వద్దకు పీర్ల స్వామి పైలేక వస్తారని తెలియడంతో ఈ దంపతులు అతడిని ఆశ్రయించారు. ఇదే అదునుగా తీసుకున్న దుర్గాసింగ్ బాబా, వారి బలహీనతను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశాడు. దంపతులు ప్రాణహాని ఉందంటూ పెద్ద మొత్తంలో డబ్బులు గుంజాడు.
మోసగాడు దుర్గాసింగ్ బాధితుల పొలంలో నిధి ఉందంటూ, ఆ నిధిని బయటకు తీస్తే తమకు ముప్పు వాటిల్లుతుందని నమ్మబలికాడు. అంతేకాక, వారి స్వగ్రామమైన ఉండవల్లిలో అర్ధరాత్రి పొలంలో క్షుద్ర పూజలు నిర్వహించాడు. ఆ పూజల అనంతరం అక్కడ అమ్మవారి విగ్రహం ఉందని ఆ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటే దంపతులకు అరిష్టం కలుగుతుందని భయపెట్టాడు.
ఈ విగ్రహం కొనడానికి విదేశాల నుంచి కొందరు ఢిల్లీ వస్తున్నారని చెప్పి, బాధితులను చాలాసార్లు ఢిల్లీకి తీసుకెళ్లి తిప్పించాడు. ఇదంతా కేవలం వారిని మభ్య పెట్టేందుకే. తాము మోసపోయామని గ్రహించిన వెంకటయ్య పద్మ దంపతులు, తమ డబ్బు తిరిగి ఇవ్వాలని బాబాను కోరారు. దీనికి ఆ నకిలీ బాబా దుర్గాసింగ్ అంగీకరించకపోగా మరింత బెదిరింపులకు పాల్పడ్డాడు. తమ గ్రామంలోకి అడుగుపెడితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
మోసంపై ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవట్లేదని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి నిర్వహించిన ప్రజాదర్బార్‌లో బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. లంకె బిందెలు, అమ్మవారి విగ్రహం, క్షుద్ర పూజలు ఇలా ఏవేవో మాయ మాటలు చెప్పి దంపతులను నిలువునా దోచేశాడు. క్షుద్ర పూజల పేరుతో నమ్మించి డబ్బు దోచుకున్న ఈ నకిలీ బాబా బాగోతంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.
ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో జోగిని వ్యవస్థ కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మెజార్టీ గ్రామాల ప్రజలు వేములవాడ ప్రాంతానికి చెందిన దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి పేరు మీద లింగ ధారణ చేసుకొని దేవునికి అంకితం కావడం జరుగుతోంది. ఈ ఆచారం ముఖ్యంగా దళిత, గిరిజనుల్లో కొనసాగుతోంది. ఈ ధారణ ఉన్న వ్యక్తులు అంత్యక్రియలు కూడా వేరే విధంగా ఉంటాయి. ఇటీవల రంగురాళ్లు ధరించడం, సంఖ్యా శాస్త్రం ఆధారంగా పేర్లు మార్చుకునే వారి సంఖ్య పెరిగింది.
గ్రామ ప్రాంత ప్రజలు అస్వస్థతకు గురైనా, చిన్న పిల్లలు ఏడ్చినా, వాంతులు-, విరేచనాలు అయినా బాబాలను, స్వాములను, సిగం ఊగే వాళ్లను పాస్టర్లను ఆశ్రయించడం జరుగుతుంది. వీటివల్ల వారి ఆరోగ్య సమస్యలకు ఎలాంటి సాంత్వన జరగకుండా చివరికి ప్రాణాల మీదికి కొనితెచ్చుకుంటున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలను అజ్ఞానులతో పాటు విజ్ఞానులు కూడా పాటించడం చాలా విచారించదగ్గ విషయం. ఇవి మితిమీరి కొనసాగడం వల్ల గ్రామాల్లో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో ఈ రకమైన అంధవిశ్వాసాలతో శాంతిభద్రతల సమస్య నెలకొంది.
మరోవైపు.. మంత్రాల నెపంతో దాడులు, హత్యలు పెరుగుతున్నాయి. మానసిక బలహినత వలన విచక్షణ కోల్పోయి అతీంద్రియ శక్తులు నమ్మడం వల్లనే సమాజంలో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ప్రజల్లో శాస్త్రీయ వైఖరి, ప్రశ్నించేతత్వం లోపించడమే దీనికి ప్రధాన కారణం. మితిమీరిన మత విశ్వాసాలు, అశాస్త్రీయ బోధనలు , ప్రభుత్వవిధానాలు, మీడియా ప్రకటనలు ప్రజల్ని మూఢత్వ దిశగా ప్రేరేపిస్తున్నాయి. మనదేశంలో గుళ్ళు, గోపురాలు, చర్చిలు, మసీదులకు ఇచ్చినంత ప్రాముఖ్యత విద్యాలయాలకు ఇవ్వడం లేదు. సైన్స్ ఆవిష్కరణల కన్నా సూడో సైన్స్ కు ఆదరణ పెరిగిపోతుంది. ఐఐటి లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సైతం అశాస్త్రీయ ప్రచారం జరుగుతుంది.
భూత వైద్యానికి, అతీంద్రియ శక్తులకు ఆదరణ పెరుగుతోంది. సమాజ అభివృద్ధికి మూలం విజ్ఞాన శాస్త్రమే. కావున విద్యాసంస్థల్లో శాస్త్రీయ ప్రగతిశీల విద్య అభ్యసనం జరగాలి. ప్రభుత్వాలు హేతుబద్ధ, శాస్త్రీయ ఆలోచనా విధానాలను ప్రోత్సహించాలని పలువురు కోరుతున్నారు. నిత్యసమస్యలను ఎదుర్కోవడానికి గల శాస్త్రీయ పరిష్కారాలను ప్రజలకు తెలియచేయాలంటున్నారు. అంతేకాకుండా సైన్స్ ప్రచార సంస్థలు కూడా ఆ దిశగా కృషి చేయాలని.. అప్పుడే దేశంలో వేళ్లూనికొని ఉన్న సామాజిక రుగ్మతలను నిర్మూలించవచ్చని చెబుతున్నారు.
ఇక… భారత దేశంలో హిందూ మతం ఎక్కువగా ఉండటం, ఇది చాలా పురాతన మతం కావడం వల్ల ఇక్కడి ఆచారాలు, విశ్వాసాలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధం, జానపద సంప్రదాయాలు, అన్నిటిలోనూ ఇటువంటి అపోహలు ఉన్నాయి. అంటే మూఢ నమ్మకం మతానికి సంబంధించినది కాదు. ప్రజలు ఈ మూఢనమ్మకాల నుంచి బయటపడటానికి ప్రధానంగా అవసరమైనది.. అవగాహనతో కూడిన శాస్త్రీయ ఆలోచనా విధానం.
ఏ విషయం జరిగినా అది ఎందుకు జరిగింది, దానికి నిజమైన కారణం ఏమిటి..? అనేది తెలుసుకోవాలనే కుతూహలం పెరిగితే ఈ అపోహలు తగ్గి పోతాయని నిపుణులు చెబుతున్నారు. భయం, అనుమానం, తెలియని విషయాలపై నమ్మకం, ఇవే మూఢనమ్మకాల బలమైన ఆధారాలు. ఒక నమ్మకాన్ని ప్రశ్నించడంలో తప్పేం లేదనే భావన పెరిగినప్పుడు.. వాస్తవం ఏమిటో తెలుసుకున్నప్పుడు మనసు విశ్వసనీయమైన సమాచారాన్ని మాత్రమే అంగీకరిస్తుందని అంటున్నారు.
మూఢనమ్మకాలు మనల్ని అంద పాతాళానికి నెట్టుతున్నాయి. మంత్ర గాళ్ళ పేరుతో జరుగుతున్న ఉన్మాదమే దీనికి నిదర్శనం. మంత్రగత్తెల పేరిట మహిళలపై దాడులు జరగడం, కోట్లాది రూపాయలు దోచేయడం చేస్తున్నారు కొందరు దుర్మార్గులు. ఇప్పటికైనా మూడనమ్మకాలను వదిలి… సైన్స్ వైపు అడుగులు వేయాలి.



