ఆంధ్ర ప్రదేశ్
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు మాతృ వియోగం

అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తల్లి చింతకుంట రత్నమ్మ (83) ఇవాళ ఉదయం కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్ యశోద హాస్పిటల్‌లో చేరిన రత్నమ్మ చకిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
ఆమె మరణం పట్ల సంతాపం తెలిపిన పలువురు నేతలు ఎంపీ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి గ్రామంలో రేపు రత్నమ్మ అంత్యక్రియాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.



