ఆంధ్ర ప్రదేశ్
TTD: తిరుమలకు రూ.9 కోట్ల భారీ విరాళం

TTD: తిరుమలలో యాత్రిక సముదాయాల ఆధునీకరణ పనులకు భారీ విరాళం అందింది. తిరుమలలోని సిఆర్వో సమీపంలో ఉన్న మూడు యాత్రిక సముదాయాలకు మంతెన రామలింగ రాజు అనే భక్తుడు 9 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ మేరకు పద్మావతి అతిథి గృహంలో ఛైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమక్షంలో విరాళం అందజేశారు.
గతంలో కూడా మంతెన రామలింగరాజు కూడా 16 కోట్లు విరాళమిచ్చారని సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని గొప్ప ఉద్దేశంతో విరాళం అందించిన రామలింగరాజుకు అభినందనలు తెలిపారు బీఆర్ నాయుడు.



