సినిమా
భర్తపై హీరోయిన్ 50 కోట్ల డిమాండ్?

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త ఆస్ట్రియన్ వ్యాపారవేత్త పీటర్ హాగ్‌పై గృహ హింస కేసు వేశారు. 50 కోట్ల పరిహారం, నెలకు 10 లక్షల భరణం కోరుతూ ముంబై కోర్టును ఆశ్రయించారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
ఒకప్పటి బాలీవుడ్ భామ సెలీనా జైట్లీ మంగళవారం ముంబై కోర్టులో తీవ్ర ఆరోపణలతో కేసు దాఖలు చేశారు. భర్త పీటర్ హాగ్ శారీరక, మానసిక, లైంగిక హింసకు పాల్పడ్డాడని, ఆస్తులు ఆర్థికంగా దుర్వినియోగం చేశాడని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. 50 కోట్ల పరిహారం, నెలకు 10 లక్షల భరణం చెల్లించాలని డిమాండ్ చేశారు.
2010లో వివాహమైన ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. పిల్లలను కలవనివ్వడం లేదని, ఆస్ట్రియాలో ఉన్న ఇంటి నుంచి రాత్రిపూట పారిపోవాల్సి వచ్చిందని సెలీనా ఆవేదన వ్యక్తం చేశారు. భర్తకు మద్యం అలవాటు, మానసిక సమస్యలున్నాయని కూడా ఆరోపించారు.



