Taylor Swift: షాకిస్తున్న టేలర్ స్విఫ్ట్ డాక్యుమెంటరీ?

Taylor Swift: ప్రపంచ మ్యూజిక్ దిగ్గజం టేలర్ స్విఫ్ట్ ఎరాస్ టూర్ వెనుకున్న భావోద్వేగాలు, కష్టాలు, కుటుంబ బంధాలు బయటపడనున్నాయి. ఆమె వ్యక్తిగత డాక్యుమెంటరీ సిరీస్ “ది ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా” ట్రైలర్ విడుదలైంది.
గ్లోబల్ సూపర్‌స్టార్ టేలర్ స్విఫ్ట్ కెరీర్‌లో ఎప్పటికీ బయటపడని కోణాలను చూపెడుతున్న డాక్యుమెంటరీ సిరీస్ “ది ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా” ట్రైలర్ రిలీజ్ అయింది. ఆరు ఎపిసోడ్లుగా రూపొందుతున్న ఈ సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో డిసెంబర్ 13 నుంచి అందుబాటులో ఉంటుంది. టేలర్ పుట్టినరోజు డిసెంబర్ 14కు ఒక రోజు ముందే ప్రీమియర్ కావడంతో స్విఫ్టీస్‌కు డబుల్ ధమాకా అవుతోంది. ట్రైలర్‌లో స్టేజ్ మీద ధైర్యంగా కనిపించే టేలర్ వెనుక ఉన్న ఒత్తిడి, భారీ రిహార్సల్స్, నిమిషానికో నిర్ణయాలు, ఎనర్జీ ఖర్చు రియల్‌గా కనిపించాయి.
ముఖ్యంగా తల్లి ఆండ్రియా స్విఫ్ట్‌తో భావోద్వేగ క్షణాలు, బాయ్‌ఫ్రెండ్ ట్రావిస్ కెల్స్ గురించి కుటుంబంతో చర్చలు హృదయాన్ని హత్తుకున్నాయి. సాబ్రినా కార్పెంటర్, ఎడ్ షీరన్ వంటి సన్నిహితులతో బ్యాక్‌స్టేజ్ మజా, వర్క్ ప్రెషర్, అంతర్గత సంఘర్షణలు టేలర్ స్వయంగా చెప్పిన తీరు ఈ సిరీస్‌పై ఆసక్తి రేకిస్తుంది. ట్రైలర్ చూసిన అభిమానులు ఇప్పటికే ఎమోషనల్ అవుతూ హైప్ పెంచేస్తున్నారు.



