సినిమా

The Paradise: ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఎప్పుడంటే?

The Paradise: నాని, దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న భారీ చిత్రం ది ప్యారడైజ్. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ త్వరలోనే రానుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

హిట్-3 తర్వాత నాని ఇప్పుడు ‘ది ప్యారడైజ్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దసరా సక్సెస్ అందించిన శ్రీకాంత్ ఓదెల ఈసారి మరింత భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌లు అందరిలో అపార అంచనాలు రేకెత్తించాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. యాక్షన్ ఎపిసోడ్స్, క్యారెక్టర్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని తెలుస్తోంది.

షూటింగ్ ఇంకా ఎక్కువగా మిగిలి ఉండటంతో రిలీజ్ డేట్ కొంచెం మారే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం లేటైనా నాణ్యత ఉంటే చాలని సోషల్ మీడియాలో శ్రీకాంత్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు. తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రొడక్షన్ లాస్ట్ స్టేజ్‌లో ఉందని, డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరి ఆరంభంలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ పాట నాని క్యారెక్టర్‌ను భారీగా ఇంట్రడ్యూస్ చేస్తుందని తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button