తెలంగాణ
Ponnam Prabhakar: ఈ విజయం ప్రతి కార్యకర్త గెలుపు

Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని గ్రామ గ్రామాన సంబరాలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ గెలుపును ప్రతి కార్యకర్త తమ గెలుపుగా భావించి సంబరాలు నిర్వహించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేసిన ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టారన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రైతులు, పేద ప్రజలకు అండగా నిలిచిందన్నారు.



