జాతియం
ఢిల్లీలో 300 కిలోల ఆర్డీఎక్స్ పట్టివేత

ఢిల్లీలోని ఫరీదాబాద్‌లో భారీగా ఆర్డీఎక్స్ పట్టుబడింది. ఓ వైద్యుడి ఇంట్లో 300 కిలోల ఆర్డీఎక్స్ గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఏకే 47, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వైద్యుడు కాశ్మీర్‌కు చెందిన ముజాహిల్ షకీల్‌గా గుర్తించారు. మూడు రోజుల క్రితం అనంత్‌నాగ్‌లో డాక్టర్ ఆదిల్ అరెస్ట్ అయ్యాడు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా సోదాలు చేపట్టిన పోలీసులు ఫరీదాబాద్‌లో సోదాలు చేశారు.



