అఖండ 2 ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్!

Akhanda 2: బోయపాటి శ్రీను ‘అఖండ 2’లో బాలకృష్ణ మాస్ యాక్షన్ మోడ్ లో సందడి చేయనున్నారు. ఫస్ట్ సింగిల్ ప్రోమో నవంబర్ 7న రిలీజ్ కానుండగా ఫుల్ సాంగ్ నవంబర్ 9న రిలీజ్ కానుంది.
మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ‘అఖండ 2’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్‌తో పాటు సంయుక్త మేనన్, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి అప్డేట్స్ రావడం మొదలైంది. మేకర్స్ ఫస్ట్ సింగిల్ ప్రోమో నవంబర్ 7న రిలీజ్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు.
నవంబర్ 9న ఫుల్ సాంగ్ విడుదల చేస్తామని తెలిపారు. ‘భం అఖండ’ లాంటి మాస్ సాంగ్‌లాగే ఇది కూడా ట్రీట్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం 14 రీల్ స్టుడియోస్ నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. బాలయ్య అభిమానులకు ఇది మరో మాస్ ట్రీట్‌గా ఉండనుంది.



