Rohit Reddy: బాధిత కుటుంబాలను పరామర్శించిన పైలట్ రోహిత్ రెడ్డి

Rohit Reddy: చేవెళ్ల బస్ ప్రమాదంలో మరణించిన కుటుంబాలను తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పరామర్శించారు. తాండూర్ పట్టణంలోని ఖలీద్, ముస్కాన్, తబస్సుంలను కుటుంబాలను ఓదార్చిన ఆయన యాలల్ మండలం లక్ష్మి నారాయణపూర్‌లో అఖిల రెడ్డి అంత్యక్రియాల్లో పాల్గొన్నారు. పేర్కంపల్లి గ్రామంలో నందిని, తానుష, సాయి ప్రియ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
తల్లిదండ్రులను కోల్పోయిన హాజీపూర్ గ్రామ చిన్నారులను ఓదార్చిన రోహిత్ రెడ్డి వారికి అండగా ఉంటానని హామి ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 10వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబల బాధ తీర్చలేనిదని చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రోడ్డు విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.



