ఆంధ్ర ప్రదేశ్
నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేసిన మొంథా తుఫాన్

మొంథా తుఫాన్ నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేసింది. కావలిలోని అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పర్యటించారు. వదర ప్రభావిత ప్రాంతాల్లో ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. సర్వేపాలెం, గుమ్మడి బొందల, రుద్రకోట, మద్దురుపాడు సహా తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించి.. బాధిత ప్రజలకు ధైర్యం చెప్పారు.



