ఆంధ్ర ప్రదేశ్
Palnadu: వైద్యుల నిర్లక్ష్యం కడుపులోనే శిశువు మృతి

Palnadu: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విఫాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందింది. సత్తెనపల్లి పట్టణం అశోక్ నగర్‌కు చెందిన మద్దిగుంట శిరీష పురిటి నొప్పులతో శనివారం ప్రశాంతి ఆస్పత్రిలో చేరింది. నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పిన వైద్యులు ఆదివారం వరకు వెయిట్ చేయాలని చెప్పారు. చివరకు ఆదివారం రాత్రి నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పిన వైద్యులు ఆ తర్వాత ఆపరేషన్ చేయాలని కుటుంబసభ్యులకు తెలిపారు.
చివరికి ఆపరేషన్ చేసి బాబుని బయటకు తీయగా బాబు మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. నార్మల్ డెలివరీ అని చెప్పి గంట ముందు వచ్చి నార్మల్ డెలివరీ సాధ్యపడదని చెప్పి ఆపరేషన్ చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హాస్పటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే బాబు చనిపోయాడని బాధితులు ఆస్పత్రి ఎదుట బైఠాయించారు.



