ఆంధ్ర ప్రదేశ్
కర్నూలు బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్

కర్నూలు బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బైక్‌పై ప్రయాణిస్తున్నది ఒక్కరు కాదు.. ఇద్దరని పోలీసులు గుర్తించారు. ఇద్దరిని బస్సు ఢీకొట్టినట్లు పోలీసులు చెప్తున్నారు. బైక్‌పై శివశంకర్‌తో పాటు స్నేహితుడు ఎర్రిస్వామి ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరూ కలసి డోన్‌కు వెళ్తుండగా బస్సు ఢీకొన్నట్లు గుర్తించారు. బస్సు ఢీకొనడంతో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి ఎగిరిపడ్డాడు. అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు గుర్తించారు.



