ఆంధ్ర ప్రదేశ్
Ambati Rambabu: నగరపాలక ఆస్తులపై కూటమి నాయకుల కన్ను పడింది

Ambati Rambabu: నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం దాదాపు 25 ఏళ్ల నుంచి నిరుపయోగంగా ఉందని నగరపాలక ఆస్తులపై కూటమి నాయకుల కన్నుపడిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆస్తులు అన్నింటినీ ప్రైవేటు వ్యక్తుల కు కట్టబెట్టడానికి ముందే ఒప్పందం కుదుర్చుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రజల సొమ్ము ను, ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం ఖండిస్తున్నామన్నారు. అన్యాయంగా అధికారంలోకి వచ్చి దోపిడి చేస్తామంటే వైసీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. గుంటూరు వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.



