తెలంగాణ
మాడ్గి అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్‌పోస్టు మూసివేత

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడ్గిలోని ఇంటర్ స్టేట్ రవాణా శాఖ చెక్ పోస్టును అధికారులు మూసివేశారు. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా ఉప కమిషనర్ వెంకటరమణ నేతృతంలో చెక్ పోస్టును బోర్డులను జేసీబీతో నేలమట్టం చేశారు.
హైదరాబాద్-ముంబయి 65వ జాతీయ రహదారిపై చెక్ పోస్టు ఎదుట ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగించారు. చెక్ పోస్టును పూర్తిస్థాయిలో రద్దు చేస్తున్నట్లు బ్యానర్ ఏర్పాటు చేశారు. ప్రజా రవాణా సహా సరుకు రవాణా వాహనదారులు ఆన్ లైన్‌లో సేవలు పొందాలని సూచించారు.



