తెలంగాణ
పోచారం కాల్పుల కేసులో పురోగతి.. ముగ్గురు నిందితుల అరెస్టు

పోచారం కాల్పుల ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం వేట కొనసాగుతోంది. కాల్పుల ఘటనలో గాయపడ్డ వ్యక్తి శరీరం నుంచి బుల్లెట్ బయటకు తీసిన డాక్టర్లు అతనికి మరో సర్జరీ అవసరం ఉందని తెలిపినట్లు సమాచారం. నిందితులను పోలీసులు కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బాధితుడిని మాట్లాడుకుందాం అని పిలిచి దాడికి పాల్పడ్డట్లు ప్రాథమిక సమాచారం.



