ఆంధ్ర ప్రదేశ్
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న పెద్దిరెడ్డి

కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకుడిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆశీర్వచనం మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పార్టీకి, జగన్ మోహన్ రెడ్డికి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు రామచంద్రారెడ్డి. ఇక అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.



