ఆంధ్ర ప్రదేశ్
Nellore: రోడ్డు ప్రమాదం.. 10 మందికి గాయాలు

Nellore: నెల్లూరు జిల్లాలో రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. కోవూరు జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఒరిస్సా నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



