Mandula Samel: వ్యవసాయ కూలీగా మారిన ఎమ్మెల్యే సామెల్..

Mandula Samel: ఆయన ఎవరు…. కూలీలతో పని చేయించే వ్యక్తి అనుకుంటున్నారా..ట్రాక్టర్‌తో దున్నతు… వరి నాట్లు వేస్తూ కూలీలతో ఆడుతూ పాడుతూ వ్యవసాయ పనులు చేయిస్తున్న అతను సాదాసీదా వ్యక్తి కాదు ప్రజలకు ఎన్నుకోబడిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్… ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఇలా పనులు చేస్తున్నాడు ఏంటని అనుకుంటున్నారా స్వయానా వ్యవసాయ కుటుంబానికి చెందిన ఎమ్మెల్యే సొంత ఊరు అడ్డగూడూరు మండల కేంద్రం ధర్మారం గ్రామంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాడు…ఎమ్మెల్యే అనగానే అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తుతూ నిత్యం ప్రజల్లో ఉండటమే కాకుండా సమయం దొరికినప్పుడల్లా తన సొంత వ్యవసాయ పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు… తన వ్యవసాయ భూమిలో వరి నాట్లు వేస్తూ కూలీలతో మమేకమై నారు పంచుతూ వరాలు తీస్తూ ట్రాక్టర్ తో దున్నతు కూలీలతో కలసిపోయి నారు వేయించాడు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్.,. నియోజకవర్గ సమస్యలే కాకుండా తన వ్యవసాయ పనులు కూడా చేసుకుంటూ రైతులకు అందరికీ ఆదర్శంగా నిలిచాడు ఎమ్మెల్యే.