ఆంధ్ర ప్రదేశ్

Mega DSC: ఏపీ మెగా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ వాయిదా

AP Mega DSC: అమరావతిలో జరగాల్సిన మెగా డీఎస్సీ నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం వాయిదా పడినట్లు కర్నూలు జేసీ నవ్య తెలిపారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం గుంటూరులో భారీ వర్షాల కారణంగా అభ్యర్థుల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం వాయిదా వేసినట్లు తెలిపారు.

కార్యక్రమ నిర్వహణ తేదీలు త్వరలో ప్రభుత్వం ప్రకటిస్తుందని తెలిపారు. భారీ వర్షాల కారణంగా మెగా డీఎస్సీ నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం వాయిదా పడటంతో అప్పటికే అక్కడికి చేరుకున్న డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button