తెలంగాణ
Harish Rao: రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది

Harish Rao: ఏడాది కాలంగా పెండింగ్ బిల్లులు, వేతనాలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నరకం చూపిస్తోందని వరంగల్ కు చెందిన మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడు పట్టించుకోవాలని , ప్రభుత్వాన్ని నిలదీయాలని మాజీ మంత్రి హరీష్ రావును కలిసి విజ్ఞప్తి చేశారు.
వారి డిమాండ్లు నెరవేరేవరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మధ్యాహ్న భోజన కార్మికులకు హరీష్ రావు భరోసా ఇచ్చారు. మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



